ANDRAPRADESH, Jr.NTR NEWS: జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో సైతం స్టార్ గా ఎలివేట్ అయ్యారు. ఆయన సినీ రంగంలో ఇంకా ఎన్నో సక్సెస్ లు చూడాల్సి ఉంది. అలాంటి జూనియర్ సడెన్ గా ఏపీ రాజకీయ తెర మీద బాగా నలుగుతున్నారు. వెండి తెర మీద నిండుగా కనిపించే ఈ హీరో ఎందుకు ఇలా రాజకీయ చర్చల్లోకి వచ్చారు అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం అంతే కాదు జూనియర్ మీద ఒక కూటమి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న అంశం కూడా చర్చకు తావిస్తోంది.
తాను అలా అనలేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పష్టం చేసినా వివాదం అలాగే ఉంది. ఇంకో వైపు జూనియర్ ఫ్యాన్స్ అయితే హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అలా జూనియర్ వర్సెస్ కూటమిగా వివాదం మారుతోందా ఏమిటి ఈ హీటెక్కించే మ్యాటర్ వెనక ఉన్న విషయం అన్నదే అంతా చర్చించుకుంటున్నారు.
నందమూరి వారసత్వంతో :
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారి మూడవ తరం వారసుడు. సీనియర్ ఎన్టీఆర్ కి స్వయాన మనవడు. ఇక సీనియర్ ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాలను రెండింటినీ శాసించారు. ఆయన సినీ వారసులుగా బాలక్రిష్ణ తరువాత జూనియర్ రాణిస్తున్నారు. రాజకీయ వారసులుగా చూస్తే నారా చంద్రబాబు నారా లోకేష్ కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ బాలయ్య హిందూపురం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాల్లో ఆయన ప్రత్యక్షంగానే ఉన్నారు. కానీ ఆయన ప్రభుత్వంలో పార్టీలో అయితే అంత ముఖ్య పాత్ర పోషించడం లేదనే చెబుతారు.
ఆ బ్రాండ్ తోనే అలా :
ఇక జూనియర్ సినిమాల్లో టాప్ రేంజికి చేరుకున్నారు. దాంతో సహజంగానే అభిమానులకు రాజకీయాల్లోనూ ఆయన రాణించాలని ఉంటుంది. అయితే ఆయన వయసు ఇంకా తక్కువ. పైగా ఆయనకు ఎంతో కెరీర్ ఉంది. అయితే జూనియర్ రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నది పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ లెగసీని కంటిన్యూ చేయాలన్నది అభిమానుల ఆశ. ఇక 2009 ఎన్నికల్లో జూనియర్ ఉమ్మడి ఏపీ అంతటా టీడీపీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉన్నారు. దాంతో కూడా ఆయన విషయంలో ఎపుడైనా రాజకీయంగా చర్చ జరుగుతూనే ఉంటుంది.
ఆ ప్రకటన సంచలనం :
నన్ను ఎవరూ ఆపలేరు అని ఇటీవల వార్ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. పైగా తాను తన అభిమానులను ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకుని వెళ్తాను అని ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దాంతోనే మెల్లగా రచ్చ మొదలైంది. నిజానికి చూస్తే టీడీపీకి జూనియర్ దగ్గరా దూరమా అన్నది ఎవరూ తేల్చలేని విషయం. ఆయన తన తాత పెట్టిన పార్టీతోనే ఉంటాను అని ఏనాడో స్పష్టం చేశారు. అయితే ఆయనకు టీడీపీ అధినాయకత్వం తో గ్యాప్ ఉందని ప్రచారం మరో వైపు ఉంది. వీటి మధ్య జూనియర్ చేసిన తాజా ప్రకటన అయితే సోషల్ మీడియాలో యూట్యూబ్ చానళ్ళలో భారీ చర్చకు ఆస్కారం ఇచ్చింది.
ఎమ్మెల్యే ఆడియో లీక్ దుమారం :
ఇక అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అంటూ బయటకు వచ్చిన ఒక ఆడియో లీకేజ్ అది నిజం కాదు అని చెబుతున్న కూడా మొత్తం అగ్గి రాజుకుంది. సదరు ఎమ్మెల్యే ఇంటి ముందుకు జూనియర్ అభిమానులు వెళ్ళడం నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగాయి. మా హీరో జోలికి రావద్దు అని వారు హెచ్చరించడమూ జరిగింది. మా హీరోని ఏమన్నా అంటే పరిణామాలు సైతం తీవ్రంగా ఉంటాయని వారు చెప్పడమూ సంచలనం రేపుతోంది. ఇక ఇదే ఇష్యూలోకి వైసీపీ ఎంటర్ అయింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.
ఒక విధంగా చూస్తే ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా పొలిటికల్ వార్ సాగుతోంది. జూనియర్ విషయంలో టీడీపీ అధికారికంగా ఏ వ్యతిరేకత వ్యక్తం చేయకపోయినా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచితంగా మాట్లాడారు అని ఆడియో లీక్ కావడంతో దానిని వైసీపీ అవకాశంగా తీసుకుని జూనియర్ వైపు మద్దతుగా మాట్లాడుతోంది. మొత్తం మీద చూస్తే జూనియర్ తనకు తెలియకుండానే ఏపీ రాజకీయ తెర మీద ఎంట్రీ ఇచ్చేశారా అన్నదే అసలైన చర్చ.
....అనంతపురం మ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బయటకు వచ్చి..NTR గారికి బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. - విజయవాడ నగర NTR ఫ్యాన్స్#NTR𓃵 #JrNTR #DaggupatiPrasad #Anantapur #TDP #Tupaki pic.twitter.com/S8HTKHdBu4
— Tupaki (@tupaki_official) August 17, 2025
విజయవాడలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోటోని తగలపెట్టిన ఎన్టీఆర్ ఫాన్స్ #NTR𓃵 #JrNTR #DaggupatiPrasad #Anantapur #Tupaki pic.twitter.com/WtYjdyRqvU
— Tupaki (@tupaki_official) August 17, 2025
Social Plugin