MOVIE'S NEWS, RANGOPAL VARMA:
సినిమా హిట్టైనా? ప్లాప్ అయినా? కథ నచ్చితేనే ఏ హీరో అయినా సినిమా చేస్తాడు. అంతకు ముందు అదే కథ రాసిన రచయిత-దర్శకులకు నచ్చితేనే ఆ కథ హీరో వరకూ వెళ్తుంది. హీరోల సూచనల మేరకు మా ర్పులు చేర్పులు చేసి పట్టా లెక్కిస్తారు. రిలీజ్ అనంతరం ఆ కథ హిట్ అయినా? ప్లాప్ అయినా? అంద రూ భాగస్వాములే. ప్లాప్ ని కొంత మంది హీరోలు స్వాగతిస్తారు. మరికొంత మంది స్వీకరించలేరు. ఇది వారి వ్యక్తిగత అభిప్రాయానికే వదిలేయాల్సిన అంశం.
స్టోరీ విన్నట్లు నటిస్తారు: అసలింతకీ స్టోరీ సెలక్షన్ లో హీరోలు ఎలాంటి అంశాలు ప్రామాణికంగా తీసుకుంటారు? దర్శక, రచయితల్ని మించి ఎనాలసిస్ చేసే సామర్ధ్యం ఉంటుందా? అన్న రెండు ప్రశ్నలకు సంచలనాల రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చాలా మంది హీరోలు పరిచయ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇస్తారని పూర్తి స్టోరీని పట్టించుకోరన్నారు. కొంత మంది హీరోలైతే ఎలివేషన్లకు ప్రాధాన్యత ఇచ్చి అసలు పాయింట్ ను వదిలేస్తారన్నారు. చాలా మంది హీరోలు స్టోరీలు విన్నట్లు నటిస్తారన్నారు.
అమితాబ్ కూడా యాక్టింగే: విషయం ఏంటంటే? వాళ్లలో చాలా మందికి డైరెక్టర్ చెబుతున్నాడో కూడా తలకి ఎక్కదు. కథ వినే ఆసక్తి కూడా వాళ్లలో ఉండదన్నారు. అమితాబ్ సహా చాలామంది స్టార్లతో పనిచేసిన క్రమంలో వాళ్లలో దగ్గరగా గమనించిన అంశంగా పేర్కొన్నారు. `సర్కార్` కథ అమితాబ్ కు పంపిస్తే? అతడు పూర్తిగా చదవలే దన్నారు. అది వర్మకు ఎలా తెలిసిదంటే తాను రాసిన కథలో తనకే కొన్ని సందేహాలు ఉండటంతో? వాటిని అమితాబ్ వద్ద రెయిజ్ చేయగా రాము నీ నుంచి ఇలాంటి ఆశించలేదన్నట్లు వర్మ తెలిపారు.
పూరి బెస్ట్ స్టోరీ టెల్లర్: అవన్నీ తనకు తెలియదున్నట్లు స్పందించారన్నారు. స్టోరీలో ఒక పాయింట్ కో, క్యారెక్టర్ కో, నాలుగైదు డైలాగులకో? కనెక్ట్ అవుతుంటారు హీరోలంతా అన్నారు. అంతకు ముందు ఆ డైరెక్టర్ పై హీరోకు ఓ రక మైన అభిప్రాయం , నమ్మకం ఉంటాయి. ఆ ధైర్యంతో ముందుకెళ్లిపోతుంటారన్నారు. మొత్తం కథ విని నిర్ణయం తీసుకునే నటుడినైతే ఇంత వరకూ ఎక్కడా చూడలేదున్నారు. బాలీవుడ్ లో కూడా అలాంటి స్టార్లు ఎవరూ లేరన్నారు వర్మ. తన వరకూ బెస్ట్ స్టోరీ టెల్లర్ ఎవరంటే పూరి జగన్నాధ్ పేరు చెప్పారు.
Social Plugin