నులిపురుగుల నివారణతో సంపూర్ణ ఆరోగ్యం.. ఆల్బెండజోల్ తో నులిపురుగుల నివారణ..


ANDRAPRADESH, ELURU: నులిపురుగుల నివారణతోనే  ఆరోగ్యం పొందుతారని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఏలూరులో విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్ మాత్రలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మంగళవారం మాత్రలు తీసుకోని వారికి ఈ నెల 18వ తేదీన మాఫ్ ఆఫ్ కార్యక్రమం ద్వారా మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు శారీరక మానసిక ఎదుగుదలకు అడ్డంకిగా మారిన నులిపురుగులకు నివారణ ఒక్కటే మార్గమని అన్నారు. పిల్లల కడుపులో నులిపురుగులు చేరి రక్తహీనత, ఆకలి మందగించడం, బరువు తగ్గటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని అన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడంతో కడుపులో నులిపురుగులు నశించిపోయి ఆరోగ్యవంతమైన జీవనానికి దోహద పడుతుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం, డిసిహెచ్ఎస్ డా.పాల్ సతీష్, ఎన్టీఆర్ వైద్య సేవ డిసి డి.రాజీవ్,సర్వ శిక్ష అభియాన్ ఏపిసి డా.కె. పంకజ్ కుమార్,జిల్లా ఐసిడియస్ అధికారి పి.శారద, పివో కె.నరేంద్ర కృష్ణ,నోడల్ ఆఫీసరు వి.వేణు, ప్రోగ్రాం ఆఫీసరు డా.శిరీష, సిడిపివో ఏ.సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.