ANDRAPRADESH, ELURU, POLAVARAM: పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం మహిళా నాయకురాలు స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలవరం నియోజకవర్గంలోని చేగుండపల్లి గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ భరోసా కార్యక్రమంలో పాల్గొని, పింఛన్ లబ్ధిదారులైన, వృద్ధులకు, వికలాంగులకు, పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన అందరికీ పింఛన్లను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, వృద్ధులు వికలాంగులు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఒకటో తారీకల్లా కచ్చితంగా లబ్ధిదారులకు పింఛన్ అందిస్తుందని ఆమె తెలిపారు.
ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆమెతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు రెవిన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Social Plugin