ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఆగస్టు 29 శుక్రవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధికార సంస్థ చైర్మన్ మినీ రవి నాయుడు ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమం జరిగింది.
జాతీయ స్థాయి క్రీడాకారులకి రాష్ట్రస్థాయి క్రీడాకారులకి ప్రోత్సాహాలు అందజేశారు. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోమ్ మినిస్టర్ అనిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరితోపాటు విశాఖపట్నం ఎంపీ భరత్, మంత్రివర్యులు డోలా వీరాంజనేయులు స్వామి, పిల్లల గోపీచంద్, ఎమ్మెస్ కే ప్రసాద్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవాస్ జగదీశ్వరి, తోటి డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Social Plugin