ANRAPRADESH, ELURU, POLAVARAM: తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి.
ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం లోని చేగుండపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకులలో ఒక్కడిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఆయన వెజినరీ ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, సమాచార, సాంకేతికతను, ఉపయోగించుకొని, రాష్ట్ర, దేశ ప్రగతిని సాధించడం కోసం అహర్నిశలు శ్రమించే ముందు చూపున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ఆయన సేవలను కొనియాడారు.
హైదరాబాద్ ఐటీ హబ్ గా మారడంలో, పరిశ్రమలు తీసుకురావడంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా, తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు పాటుపడుతున్న, ఆదర్శవంతమైన నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్ టి సెల్ ఉప అధ్యక్షులు, విజయ్ నాయక్, నరేష్ చౌదరి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Social Plugin