జనసేన ఆఫీస్ వద్ద సడెన్ గా తెలంగాణా మంత్రులు ల్యాండ్ !


TELANGANA, JANASENA NEWS: తెలంగాణా మంత్రులకు జనసేన ఆఫీసు వద్ద పనేంటి అన్న ప్రశ్న రావచ్చు. ఏపీలో జనసేన అధికారంలో ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. అలా రాజకీయంగా చూసినా కూడా ఇది సంచలనమే అవుతుంది. కానీ ఇది జరిగింది. ఎలా ఏమిటి అంటే మ్యాటర్ చాలా ఇంట్రెస్ట్ గానే ఉంది. పైగా ఒకరు ఇద్దరు కాదు అయిదురుగు మంత్రులు ల్యాండ్ అయ్యారు. దాంతో ఇది రాజకీయ సంచలనంగానూ ఉంది. 


వారంతా అక్కడే
తెలంగాణా కాంగ్రెస్ మంత్రులు చూస్తే అందులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. వీరందరూ జనసేన కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లారు. ఇలా సడెన్ గా తమ పార్టీ ఆఫీసుకు వచ్చేసరికి జనసేన నాయకులు ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు. అయితే జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ వారందరినీ సాదరంగా స్వాగతించి శాలువలతో సత్కరించారు. అంతే కాదు కొండపల్లి బొమ్మలను కూడా జ్ఞాపికలుగా వారికి ఇచ్చి మర్యాద చేశారు. 
 
ఇంతకీ ఎందుకు వచ్చారంటే
తెలంగాణా కాంగ్రెస్ మంత్రులు జనసేన ఆఫీసుకు రావడం అన్నది ఆసక్తికరమే. వీరు అంతా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వెళ్తూ జనసేనకు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉన్న హెలిపాడ్ ని వాడుకున్నారు అని అంటున్నారు. అలా కొద్ది సేపు అక్కడ వారు ల్యాండ్ అయ్యారు అని అంటున్నారు. అయితే ఆ విధంగా వారికి హెలిపాడ్ కి చోటు ఇచ్చి గౌరవించి పంపించి ఎంతో మర్యాద చేసింది జనసేన. 

సానుకూల అంశంగానే
ఒక వైపు ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో వివాదం ఉంది. ఈ జల వివాదం ఇంకా కొనసాగుతోంది. కేంద్ర పెద్దల వద్ద పంచాయతీగా కూడా ఉంది. అయితే ఆ ఇష్యూ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత రాజకీయంగా వేడి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన మంత్రులు ఏపీలోని టీడీపీ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన ఆఫీసుకు రావడం అంటే రాజకీయంగా చూసినా సానుకూల అంశమే అని అంటున్నారు. 

రాజకీయాలు వేరు అయినా రాష్ట్రాలు రెండూ తెలుగు మాట్లాడేవారివే. ఆ సామరస్యం అలాగే కొనసాగాలని అంతా కోరుకుంటున్న నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన మాత్రం అంతా చర్చించుకునేలా ఉంది. అంతే కాదు స్వాగతించేలా కూడా ఉంది. పవన్ రాజకీయాల కంటే కూడా అందరితో సామరస్య వైఖరికే ప్రాధాన్యత ఇస్తారు అన్నది తెలిసిందే.