రేవంత్ కు సీఎం పదవిపై బీఆర్ఎస్ ట్వీట్.. రాహుల్ కు సూటి ప్రశ్న..


TELANGANA: రాజకీయంలో ఒక పార్టీపై మరోపార్టీ దుమ్మెత్తి పోసుకోవడం షరా మామూలే. అలాగయితేనే ప్రజల నోళ్లలో ఉంటామని పార్టీల అభిప్రాయం. ప్రజలకు మంచి చేయడం మాట అటుంచితే.. నువ్వీ తప్పు చేశావు.. నువ్వీ తప్పు చేశావు.. అంటూ ప్రజా సమస్యలను గాలికి వదలే నాయకులే ఎక్కువగా కనిపిస్తుంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రేవంత్ సీఎం అయిన తర్వాత పలు కేసులతో బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బందులు తప్పడం లేదు. 


రాహుల్ గాంధీ వ్యాఖ్యల గుర్తు చేసిన బీఆర్ఎస్ ఇటీవల రాహుల్ గాంధీ దొంగ ఓట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఓట్లతో తాము కర్ణాటకలో ఒక ఎంపీ సీటును కూడా కోల్పోయామని చెప్పడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక్క ఎంపీ స్థానంలోనే లక్షలాది దొంగ ఓట్లు ఉంటే ఇక దేశంలో ఎంత మేరకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. దీనికి ఈసీ కూడా రాజకీయ ఆరోపణలు కాదని, రాతపూర్వకంగా కంప్లయింట్ చేయాలని కోరింది. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 60 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు ఈసీ ఇటీవల ప్రకటించింది. తుది జాబితాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని తెలిపింది. 

తెలంగాణ సీఎంపై విమర్శలు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎక్స్ వేధికగా పలు ప్రశ్నలను సంధించింది. దొంగ ఓట్లపై రాహుల్ గాంధీకి అంత బాధ్యత ఉంటే మరి తెలంగాణలో ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ రేవంత్ ను ఎలా సీఎం చేస్తారంటూ ప్రశ్నించింది. మీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారచ్చు. కానీ మా రాష్ట్రంలో ఓట్ చోర్ ను ఎలా ముఖ్యమంత్రి చేశారంటూ నిలదీశారు. #VoteChor ను బీఆర్ఎస్ నేతలు వైరల్ చేస్తున్నారు. కౌంటర్ కామెంట్లు చేస్తున్న కాంగ్రెస్.. 

బీఆర్ఎస్ నాయకులు చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి మంచి సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజల మనసులను చూరగొంటుందని ఈ సమయంలో తమ సీఎంను ఇలా చూపించడం బీఆర్ఎస్ కు తగదన్నారు. దీనికి సంబందించిన కేసు కోర్టులో నడుస్తుందని, విచారణ పూర్తయి తీర్పు వచ్చే వరకు దీనిపై మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఏది ఏమైనా #VoteChorను బీఆర్ఎస్ నేతలు బాగా వైరల్ చేస్తున్నారు.