INDIA NEWS: ఇక ఎంపీలుగా గెలిచిన బీజేపీకి చెందిన 240 మంది కూడా ఎన్నికల సంఘం సమర్పించిన తప్పుడు జాబితా కారణంగానే అని భారీ నిందనే వేశారు. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఉన్నఫళంగా రాజీనామా చేయాలట. ఈ డిమాండ్ చేసింది కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయితే కాదు. తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అభిషేక్ బెనర్జీ నుంచి వచ్చింది ఈ డిమాండ్. మోడీ ఎందుకు రాజీనామా చేయాలి అంటే 2024 ఎన్నికలు సాఫీగా సవ్యంగా సాగలేదని ఓట్ల తారుమారు ఓట్ల చోరీ కారణంగానే జరిగాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఆయన వల్లిస్తున్నారు. ఆ ఓట్లతో గెలిచిన గెలుపు సవ్యమైనది కాదని తర్కం కూడా చెబుతున్నారు.
ఆ ఎన్నికల్లో ఓటు వేయరాదు: ఇక ఎంపీలుగా గెలిచిన బీజేపీకి చెందిన 240 మంది కూడా ఎన్నికల సంఘం సమర్పించిన తప్పుడు జాబితా కారణంగానే అని భారీ నిందనే వేశారు. అందుకే వారి ఎన్నిక కూడా చట్టబద్ధం కాదని వాదిస్తున్నారు. ఇక వీరంతా చేయాల్సింది రాజీనామాలే అని ఆయన అంటున్నారు. మోడీ ప్రభుత్వానికి కూడా ఎలాంటి చట్టబద్ధత లేదని మరో బాంబు కూడా పేల్చారు. ఈ ఎంపీలే రాబోయే రోజులలో రాష్ట్రపతి ఉప రాష్ట్రపతిలను కూడా ఎన్నుకోబోతారు కాబట్టి ముందుగా రాజీనామాలు చేయాల్సిందే అని ఆయన గట్టిగా చెబుతున్నారు. రాజీనామాలు చేయకపోతే ఇబ్బందే అని అంటున్నారు.
బీహార్ తో ముడిపెట్టి మరీ : బీహార్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది అని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో దేశంలోని గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఓటర్ల జాబితా సరైనది అని ఎలా ఎన్నికల సంఘం చెబుతుందని ప్రశ్నించారు. దేశంలో చట్టం అన్ని చోట్లా వర్తిస్తుందని రెండు చట్టాలు ఉండవని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విధానం అంతకంటే ఉండదని అంటున్నారు. అందువల్ల దేశమంతా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించాలని కోరుతున్నారు. అంతే కాదు బీహార్ ఎన్నికల్లో పాత ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహిస్తే బీజేపీ ఓటమి పాలు అవుతుందని భావించే ఈ విధంగా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
ఈసీ మీద ఫైర్ : కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు జవాబులు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. జవాబులు చెప్పి సందేహాలు తీర్చాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా మౌనం పాటిస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి భయపడినట్లుగానే అర్ధం చేసుకోవాలని ఆయన అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక అభిషేక్ బెనర్జీ ఏకంగా ప్రధాని మోడీ ఆయన కేబినెట్ ని రాజీనామా చేయమని అంటున్నారు. ఆ తరువాత లోక్ సభను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ముదురుతున్న వివాదం : రాహుల్ గాంధీ ఆరోపణలను సమర్థిస్తూ ఇండియా కూటమి మిత్రులు అంతా గళం విప్పుతున్నారు. మోడీని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఈ ఫలితాలు సరైనవి కావు అని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధతనే ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా ఇది ఇబ్బందికరంగా మారుతున్న నేపధ్యం ఉంది. మరి దీని మీద ఈసీ కానీ కేంద్ర ప్రభుత్వం కానె ఎ ఏ విధంగా జవాబు చెబుతుంది ఏ విధంగా విపక్షాల రచ్చకు ఎండ్ కార్డు పడుతుంది అన్నది వేచి చూడాల్సి ఉంది.
Social Plugin